వాటర్ ఫెస్టివల్..285 మంది మృతి

242
285 killed in Myanmar water festival
- Advertisement -

సంతోషంగా జరపుకునే పండుగ దుఖాన్ని మిగిల్చింది. ఉత్సవాల్లో ఉత్సహాంగా పాల్గొన్నవారు విగతజీవులయ్యారు. నాలుగు రోజుల పాటు జరిగిన తింగ్యాన్‌ వాటర్‌ ఫెస్టివల్‌‌తో మాయన్మార్ శ్మశానవాటికలా మారింది. ఈ ఉత్సవాల్లో ప్రమాదవశాత్తు 285 మంది మృత్యువాతపడ్డారు. మరో 1,073 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీటిలో అత్యధికంగా యంగూన్ ప్రాంతంలో 44 మంది, మాండాలే‌లో 36 మంది, బగోలో 37 మంది, షాన్ రాష్ట్రంలో 28 మంది, అయేవాడే రీజియన్‌లో 28 మంది ప్రాణాలు కోల్పోయారు.

మిగతా ప్రాంతాల్లోనూ జనం పెద్ద సంఖ్యలో గాయపడినట్లు సమాచారం. వీటితో పాటు మాదకద్రవ్యాలు, దోపిడీ, దొంగతనాలు, కారు ప్రమాదాలు, హత్య ఘటనల్లో 1200 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.

మయన్మార్‌లో తింగ్యాన్‌ అంటే సంక్రాంతి అని అర్థం. నాలుగు రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ సంబరాలు జరపుకుంటారు.ఈ వాటర్ లో తడిస్తే పాపాలు పోతాయని మయన్మార్ ప్రజల విశ్వాసం. 2016లో జరిగిన థింగ్యాన్ వాటర్ ఫెస్టివల్లో 272 మంది చనిపోగా ఈ సారి మృతుల సంఖ్య పెరిగినట్టు స్థానిక పత్రిక గ్జిన్హువా వెల్లడించింది. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించినప్పటికీ ఈ ఫెస్టివల్‌లో ప్రాణాలు పోగుట్టుకోవడం ఇక్కడ సాధారణంగా మారింది.

https://youtu.be/X6XtyCiJXK8

- Advertisement -