రేవంత్ క్షమాపణ చెప్పాలి: విద్యుత్ ఉద్యోగులు

858
revanth reddy
- Advertisement -

విద్యుత్ సంస్థల సిఎండిలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికావని ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు విద్యుత్ ఉద్యోగులు. ఈమేరకు విద్యుత్ సౌధలో ధర్నా నిర్వహించిన ఉద్యోగులు ఆయన క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్ కార్యాచరణకు దిగుతామని చెప్పారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

గత కొద్దిరోజుల గా ప్రతి పక్ష పార్టీలు చేస్తున్న వాఖ్యలు నిశితంగా గమనిస్తున్నామని ఉద్యోగుల సంఘం నేత రమేష్ చెప్పారు. చీకటి నుండి వెలుగులోకి తెచ్చాము,రాష్ట్రం రాకముందు చీకట్లు ఉండేవి రాష్ట్రం వచ్చాక వెలుతురు తో నింపాం…సీఎండీ ప్రభాకర్ రావు గొప్పగా పని చేసి మాకు అండదండలు ఇవ్వడం వల్లే రైతులకు ,రాష్ట్ర ప్రజానీకానికి నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు.

అమరవీరుల స్తూపం దగ్గర ప్రభాకర్ రావు ను కాల్చి చంపాలి అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం లేదంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

నిజాయితీకి మారుపేరు ప్రభాకర్ రావుని చెప్పారు రత్నాకర్ రావు. రిటైర్ అయ్యాక ఇంట్లో కూర్చుకో ఎందుకు చేస్తున్నారని రేవంత్ మాట్లాడారు కానీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా రిటైర్ అయిన వారే ఉన్నారు అది గమనించాలని సూచించారు. రేవంత్ వెంటనే సీఎండీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -