10 నెలల్లో పాలమూరు పూర్తి: సీఎం కేసీఆర్

536
cm kcr
- Advertisement -

పాలమూరు ఎత్తిపోతల పథకం రాబోయే 10 మాసాల్లో పూర్తవుతుందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం వనపర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం…కొన్ని ప్రగతి నిరోధక శక్తుల వల్ల ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందన్నారు.

గత పాలకులు పాలమూరును కరువు జిల్లాగా మార్చారని.. తాము.. పచ్చని పంటల జిల్లా మారుస్తామన్నారు సీఎం కేసీఆర్. ఈసారి అదృష్టం కొద్దీ కృష్ణాలో నీళ్లున్నాయి. రాబోయే రోజుల్లో అద్భుతాన్ని చూడబోతున్నామని తెలిపారు.

నదుల అనుసంధానంపై ఏపీ సీఎం, నేను ఒక అభిప్రాయానికి వచ్చినమని సీఎం కేసీఆర్ తెలిపారు. త్వరలో గోదావరి-కృష్ణా లింక్ చేస్తామని చెప్పారు . నదుల అనుసంధానంపై ఇరురాష్ట్రాలు తగిన రీతిలో అగ్రిమెంట్ చేసుకుంటాయని వెల్లడించారు. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడం వల్ల 570 టీఎంసీల నీళ్లు వాడుకోవడానికి వెసులుబాటు కలిగిందన్నారు.

చంద్రబాబు కుంచిత మనస్తత్వంతో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. గతంలో ఇదే చంద్రబాబు బాబ్లీ మీద గొడవపెట్టుకుని ఏమి సాధించలేదన్నారు. పరవాడ ప్రాజెక్టులతో గొడవపెట్టుకున్న చంద్రబాబు సాధించింది సున్నానని సీఎం ఎద్దేవా చేశారు.

- Advertisement -