డిసెంబర్‌ 7న తెలంగాణ ఎన్నికలు..11న ఫలితాలు

273
rawat
- Advertisement -

తెలంగాణ,మధ్యప్రదేశ్,మిజోరం, ఛత్తీస్ గడ్‌,రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్‌ని విడుదల చేశారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్. నేటి నుంచి ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. పర్యావరణ రహితంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు.

డిసెంబర్‌ 7న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని..11న ఫలితాలు విడుదల చేస్తామన్నారు. తెలంగాణలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.తెలంగాణ ఓటర్ల జాబితా హైకోర్టు పరిధిలో ఉంది.. హైకోర్టు తీర్పు తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు. ఈ నెల 12న ఓటర్ల జాబితాను ప్రకటిస్తామన్నారు.

అక్టోబర్ 27న మధ్యప్రదేశ్,మిజోరం,ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాల్లో అక్టోబర్ 28న రాజస్ధాన్ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. డిసెంబర్ 15 లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తిచేస్తామని చెప్పారు. ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు.

నాలుగు రాష్ట్రాలకు ఈవీఎంలు,వీవీ ప్యాట్‌లు సిద్ధం చేశామని చెప్పారు. ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.

- Advertisement -