ప్రారంభమైన కౌంటింగ్… తొలి ఫలితంపై ఆసక్తి

244
votes counting
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న నేతల భవితత్వం మరికొద్ది గంటల్లోనే తేలనుంది. ఈ ఫలితాల కోసం దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మొదటగా 8గంటల నుంచి 8.30గంటల వరకూ బ్యాలెట్లను లెక్కించనున్నారు. తిరస్కరించిన ఓట్ల కన్నా మెజార్టీ తక్కువగా ఉంటే వాటిని మళ్లీ లెక్కిస్తారు.. .వాటి లెక్కింపు పూర్తయ్యాక ఈవీఎంల ఓట్ల లెక్కింపును ప్రారంభింస్తారు. తెలంగాణలో 17పార్లమెంట్ నియోజకవర్గాల్లో 35 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగనుంది. 12గంటల లోపు తొలి ఫలితం వెలువడవచ్చిన తెలుస్తుంది. పూర్తీ ఫలితాలు సాయంత్రం 5గంటలలోపు తెలియనున్నాయి.

- Advertisement -