16మనమే గెలుస్తున్నాం.. సంబరాలకు రెడీగా ఉండండిః సీఎం కేసీఆర్

207
kcr

మరికొద్ది క్షణాల్లో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8గంటలకు ప్రారంభమైన కౌంటింగ్..మొదట బ్యాలెట్ పేపర్లను లెక్కించనునున్నారు. ఇక తెలంగాణలో 16పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని మొదటి నుంచి ధీమా వ్యక్తం చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. ఇక తాజాగా పార్టీ సన్నిహితులకు మరో సారి స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలోని మొత్తం లోక్ సభ స్ధానాలు మనమే గెలవబోతున్నాం..సంబరాలకు పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.

బుధవారం ప్రగతిభవన్ లో మంత్రులు, పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉండబోతున్నాయని 16లోక్ సభ స్ధానాలు టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని చెప్పారు. నేడు వెలువడే ఫలితాలతో ప్రతిపక్షాల మరోసారి అడ్రస్ గల్లంతవుతుందని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏజెంట్లు, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లెక్కింపు సమయంలో ఏదైనా సమయ్య ఉంటే అధికారులు దృష్టికి తీసుకురావాలని తెలిపారు.