మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్!

6
- Advertisement -

హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో మరో రెండు రాస్ట్రాల్లో ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయంది.

మధ్యాహ్నం 3.30 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు ఈసీ వెల్లడించింది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్ లోకసభ స్థానం, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 45 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల తేదీలను ప్రకటించనుంది.

Also Read:తుపాను ఎఫెక్ట్..ఏపీలో భారీ వర్షాలు

వాస్తవానికి హర్యానా, జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడే మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లకు తేదీలను ప్రకటిస్తారని భావించారు. కానీ, ఈసీ కేవలం రెండు రాష్ట్రాలకు మాత్రమే షెడ్యూల్ ప్రకటించి, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లను పక్కనబెట్టింది.

- Advertisement -