అంతా ఎన్నికల కోసమే ఈ ఖర్చు …..

64
eci
- Advertisement -

2022వ ఆరంభంలో ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు భారీగా ఖర్చులు చేశాయి. ఆయా రాజకీయా పార్టీలు ఏకంగా భారీ మొత్తంలో ఖర్చు చేసి మళ్లీ ఆధికారంలోకి వచ్చాయి. బీజేపీ రూ.340కోట్లు వెచ్చించిగా రెండవ స్థానంలో కాంగ్రెస్‌ ఉండగా మిగిలిన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్‌ రూ.194కోట్లు మేర ఖర్చు చేసింది. ఈ విషయాలను ఎన్నికల సంఘం గణాంకాలు వెల్లడించాయి.

ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ప్రచారాల నిమిత్తం భాజాపా రూ.340కోట్లను ఖర్చు పెట్టినట్టుగా వివరాలను ఇటివలే ఈసీ సమర్పించింది. ఇదే ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ రూ.194కోట్లు, తృణమూల్‌ రూ.47కోట్లు, ఆప్‌ రూ.11కోట్లు ఖర్చు చేసినట్టుగా ఆయా పార్టీల నివేదికలు పేర్కొన్నాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు తప్పనిసరిగా తమ ఎన్నికల నిర్వహణ ఖర్చుల నివేదికలను ఈసీకి సమర్పించాలి. కాగా ఈ ఐదు రాష్ట్రాల్లో పంజాబ్‌లో ఆప్‌ ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. పంజాబ్‌లో కాంగ్రెస్‌ అధికారం కొల్పోయి ఆప్‌కు అప్పజెప్పింది.

- Advertisement -