ప్రతిపక్షాలకు మరో ఎదురుదెబ్బ..

221
Election Commission
- Advertisement -

వీవీప్యాట్ల వివాదంపై ప్రతిపక్షాలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాల కౌంటింగ్ ప్ర‌క్రియ‌లో మార్పు ఉండ‌ద‌ని నేడు ఎలక్షన్‌ కమీషన్‌ స్ప‌ష్టం చేసింది. ఓట్ల లెక్కింపులో భాగంగా ఈవీఎం ఓట్ల కంటే ముందు వీవీ ప్యాట్లను లెక్కించాలన్న విపక్షాల డిమాండ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది.

వీవీ ప్యాట్లను ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతే లెక్కిస్తారని మరోసారి స్పష్టం చేసింది. వీవీప్యాట్ల ఎంపిక లాట‌రీ ప‌ద్ధ‌తిలో జ‌రుగుతుంది. ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి 5 వీవీప్యాట్లు లెక్కించాల‌ని ఇటీవ‌ల సుప్రీం తీర్పు ఇచ్చింది.

Opposition parties

రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌, ఏపీ, రాజస్థాన్‌, దిల్లీ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, అశోక్‌గహ్లోత్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ల నేతృత్వంలో 22 రాజకీయ పార్టీలు మంగళవారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి 11 పేజీల వినతిపత్రం అందజేశాయి. దీనిపై బుధవారం చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈసీ తెలిపింది. ఈ మేరకు నేడు సమావేశమైన ఎన్నికల సంఘం.. విపక్షాల డిమాండ్‌ను తిరస్కరించింది.

- Advertisement -