ఏసీబీకి చిక్కిన అవినీతి ఎస్‌ఐ..

142
Gurrampodu SI

లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన ఓ అవినీతి ఎస్‌ఐ కటకటలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా పరిధిలో జరిగింది. జిల్లాలోని గుర్రంపోడు చెందిన ఎస్ఐ క్రాంతికుమార్,హోంగార్డ్ గఫ్ఫార్ ఏసీబీకి అడ్డంగా దొరికారు. ఓ చెరుకు బండి వద్ద వెంకట్ రెడ్డి అనే రైతు నుంచి రూ 40 వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.

ఏసీబీ అధికారులను చూసి డబ్బు చెరుకు బండి వ్యాపారికి ఇచ్చి పారిపోయే ప్రయత్నం చేశాడు హోంగార్డ్. ఏసీబీ ఎస్ఐ క్రాంతికుమార్,హోంగార్డ్ జఫ్ఫార్ లను అదుపులోకి తీసుకుని పీఎస్‌లో విచారిస్తున్నారు. భూమి పంచాయతీ వ్యవహారంలో ఎస్‌ఐ లంచం డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.