2027 వరకు ఎల్‌నినో ఎఫెక్ట్!

1
- Advertisement -

ఎల్ నినో ఎఫెక్ట్ 2027 ప్రారంభం వరకు కొనసాగే అవకాశం ఉంది అని నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణానికి ముప్పుగా పరిణమించవచ్చని చెప్పుకొచ్చారు. ఎల్ నినో అనేది ఒక వాతావరణ పరిస్థితులను అద్యయనం చేస్తుంది. దీని వల్ల కొన్ని ప్రాంతాల్లో అసాధారణమైన పొడి వాతావరణం, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఇది వ్యవసాయ మరియు ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ప్రస్తుతం పశ్చిమాసియా వివాదాల వల్ల ఎరువుల ధరలు పెరిగి, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పంట దిగుబడులపై అనిశ్చితి నెలకొంది. ఇప్పుడు ఎల్ నినో ప్రభావం కూడా తోడైతే, ప్రపంచ మార్కెట్లో ఆహార ధాన్యాల ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ఇది అత్యధిక రేటింగ్ ఉన్న ఆర్థిక వ్యవస్థలపై కూడా ద్రవ్యోల్బణ ఒత్తిడిని కలిగిస్తుంది.

అమెరికా వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం..2026 డిసెంబర్ నుండి 2027 ఫిబ్రవరి వరకు ఎల్ నినో కొనసాగే అవకాశం 96% ఉంది. దీనివల్ల వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలకు అంతరాయం కలగవచ్చు. కేవలం ఎల్ నినో వల్ల ఒక దేశం యొక్క క్రెడిట్ రేటింగ్ వెంటనే పడిపోకపోవచ్చు. అయితే ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండి….ఒక దేశం యొక్క వృద్ధి రేటు తగ్గినా, ద్రవ్యోల్బణం పెరిగినా, లేదా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి క్షీణించినా అది ఆ దేశ రేటింగ్‌పై ప్రభావం చూపుతుంది.

ముఖ్యంగా తక్కువ రేటింగ్ ఉన్న (B కేటగిరీ లేదా అంతకంటే తక్కువ) దేశాలు, పరిమిత మార్కెట్ సౌకర్యాలు ఉన్న దేశాలు ఈ వాతావరణ మార్పుల వల్ల మరింత దెబ్బతినే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో మాత్రం ఎల్ నినో వల్ల వర్షపాతం పెరిగి, అది వ్యవసాయ దిగుబడికి, ఆహార ఉత్పత్తికి సానుకూలంగా మారే అవకాశం ఉందని ఫిచ్ పేర్కొంది.మొత్తానికి ఈ వాతావరణ మార్పులు దేశాల ఆర్థిక స్థితిగతులపై ముఖ్యంగా ద్రవ్యోల్బణం పై ఒత్తిడిని పెంచుతాయని ఫిచ్ నివేదిక హెచ్చరిస్తోంది.

Also Read:రాజీనామా చేసి వెళ్లండి:సంజయ్

- Advertisement -