- Advertisement -
మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. మహా సంక్షోభానికి గురువారం రాత్రితో ముగిసింది. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని సంకీర్ణ సర్కారుపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన మంత్రి ఏక్‌నాథ్షిం డే గురువారం రాత్రి 7.30 గంటలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. శివసేన తిరుగుబాటు వర్గానికి మద్దతు ప్రకటించిన విపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొషియారీ రాజ్ భవన్‌లో వీరితో ప్రమాణం చేయించారు.
- Advertisement -