పహల్గాం ఉగ్రదాడిలో జాతి, మతం గురించి మాట్లాడకూడదు అని బీజేపీ మిత్రపక్షం శివసేన పార్టీ అధ్యక్షుడు ఏకనాథ్ షిండే తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన సయ్యద్ హుస్సేన్ షా కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం, ఇల్లు కట్టిస్తామని మా శివసేన పార్టీ తరపున హామీ ఇచ్చాం అన్నారు.
పర్యాటకులను కాపాడడానికి వెళ్ళి మరణించిన సయ్యద్ హుస్సేన్ షా కూడా అమరుడేనన్నారు. ఉగ్రవాదుల నుండి గన్ లాక్కుని పర్యాటకులను కాపాడేందుకు ప్రయత్నించి సయ్యద్ హుస్సేన్ షా మరణించాడు.. మేము వాళ్ల కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్ళినపుడు వారి ఆర్థిక పరిస్థితి, ఇల్లు చూసి బాధేసింది.. సంపాదించే ఒక్క కొడుకు చనిపోయాడని వాళ్ల కుటుంబ సభ్యులు బాధపడ్డారు అన్నారు.
పర్యాటకులను రక్షించడానికి ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడారు హార్స్ రైడర్ సయ్యద్ హుస్సేన్ షా. పర్యాటకులపై దాడికి దిగిన ఉగ్రవాదులను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఉగ్రవాదుల నుండి తుపాకీని లాక్కునే ప్రయత్నంలో హుస్సేన్ షాను కాల్చి చంపేశారు ఉగ్రవాదులు.
Also Read:ఇంటర్ ఫెయిల్.. సివిల్స్‌లో సత్తా

