జెఎన్టియు హైదరాబాద్ పరిధిలో గల పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో ఆగస్టు 2, 3వ తేదీల్లో వివిధ ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకులకు ఎఫెక్టివ్ మోనిటరింగ్ అనే అంశంలో నైపుణ్యంతో కూడిన మెళుకువలను నేర్పడానికి కళాశాల మరియు JNTUH- TEQIP-III వారి సౌజన్యంతో శిక్షణా కార్యక్రమం నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఉపాధ్యాయుల నైపుణ్య అభివృద్ధి తద్వారా విద్యార్థులను మంచి పౌరులుగా మరియు ఉన్నత విలువలతో కూడిన సాంకేతిక విద్యను ఎలా అభ్యసించాలని నేర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ మనస్తత్వ నిపుణురాలు డాక్టర్. అర్చన నండూరి విచ్చేసి అధ్యాపకులకు ఎఫెక్టివ్ మోనిటరింగ్ లోని మెళుకువులను నేర్పించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి పల్లవి ఇంజనీరింగ్ కాలేజీ వైస్ చైర్మన్ ఎం కొమరయ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ N.సత్యనారాయణ, వైస్-ప్రిన్సిపాల్ డాక్టర్ కే నాగ జ్యోతి, జేఎన్టీయూహెచ్ – EAP కో ఆర్డినేటర్ డాక్టర్ A.రజని, TEQIP-III కోఆర్డినేటర్ డాక్టర్ పద్మజా రాణి ఎఫెక్టివ్ మోనిటరింగ్ గురించి వివరించి పాల్గొన్న అధ్యాపకులకు సర్టిఫికేటు ప్రధానం చేయడం జరుగుతుంది.