ఈ సారి రక్షణ బడ్జెట్‌ పెంపు…

38
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం ఈ సారి రక్షణ శాఖకు భారీగా కేటాయింపులు పెంచింది నిర్మలా సీతారామన్. 2023-24 లో రక్షణ వ్యయాలు సుమారుగా 12.95శాతం పెరిగింది. గత బడ్జెట్‌లో రూ.5.25లక్షల కోట్ల నుంచి ఈసారి రూ.5.94లక్షల కోట్లను కేటాయించారు. కొత్త ఫైటర్ జెట్‌లు జలాంతర్గాములు యుద్ద ట్యాంకులు కొనుగోలుకు అధునాతన ఆయధ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి డిఫెన్స్ను బలోపేతం చేయడానికి ఈ సారి బడ్జెట్‌ను ఈ మేరకు పెంచినట్టు వెల్లడించారు.

సాయుధ దళాల ఆధునీకరణ బడ్జెట్‌ కూడా 6.5శాతం మేర పెరగనున్నట్టు తెలిపింది. గతేడాది రూ.1.52లక్షల కోట్లు ఉండగా దీనిని ఈ సారి రూ.1.62లక్షల కోట్లకు పెంచారు. రక్షణ రంగంలో దేశీయ తయారీదారుల నుంచి ఆయధ వ్యవస్థలు పరికరాలను కొనుగోలు చేసేందుకు గాను మేక్ఇన్ ఇండియా లో భాగంగా ఈ నిధులను వినియోగించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు రక్షణ శాఖ కొత్తగా అధునాతన యుద్ధ సామాగ్రిని సముపార్జించుకొనుంది. కొత్త జనరేషన్‌ 4.5 యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని భారత వైమానిక దళం యోచిస్తున్నది.

దేశీయంగా యుద్ధ విమానాల తయారీలో పెట్టుబడులకు కేంద్రం నిధులు కేటాయించనున్నది. ఆధునాతన సబ్‌మెరైన్లను నేవీ సమకూర్చుకోనున్నది. అలాగే ఫ్రాన్స్‌ నుంచి యుద్ధ విమానాల కొనుగోలుపై దృష్టిసారించింది. అయితే ఈ ఒప్పందం ఇంకా ఓ కొలిక్కి రావాల్సి ఉంది. ఇక తేలికపాటి యుద్ధ ట్యాంకులు, ఆర్టిలరీ గన్స్‌ను ఆర్మీ కొనుగోలు చేయనున్నది.

ఇవి కూడా చదవండి…

కేంద్ర వార్షిక బడ్జెట్… హైలైట్స్

దళితుల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు..

కేంద్ర బడ్జెట్…ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే

- Advertisement -