ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో సింగపూర్ న్యూయార్క్ సంయుక్తంగా మొదటి స్థానాన్ని పోందాయి. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వారు నిర్వహించిన వరల్డ్ వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ద్వారా నిర్వహించారు. ఇందులో మొత్తంగా ఈ యేడాది ఆగస్టు నుంచి సెప్టెంబర్‌లో నిర్వహించిన సర్వేల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 172 నగరాల్లో సర్వే నిర్వహించారు.
పాశ్యాత్య దేశాల ఆంక్షల వల్ల రూబుల్ తన ప్రాభావాన్ని కొల్పోలేదు. దాంతో రష్యాలోని మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరాలు వరుసగా 88, 70స్థానాల్లో నిలిచియాని నివేదిక పేర్కొంది. గత యేడాది అగ్రస్థానంలో ఉన్న టెల్ ఆవీవ్ ఈసారి మూడో స్థానానికి పడిపోయిందని తెలిపారు.
హాంకాంగ్ లాస్‌ఏంజిల్స్ మొదటి ఐదు ఖరీదైన స్థానాలను సాధించింది. అయితే భారత్‌లోని బెంగళూరు చెన్నై అహ్మదాబాద్ నగరాలు వరుసగా 161,164,165 స్థానాల్లో ఉన్నాయి. సిరియా రాజధాని డమాస్కస్ మరియు లిబియాలోని ట్రిపోలీ ప్రపంచంలోనే అత్యంత చౌకైన ప్రదేశాలుగా గుర్తించారు.
ఇవి కూడా చదవండి…