- Advertisement -
253 పార్టీల గుర్తింపును రద్దు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. పేరుకే తప్ప ఎక్కడా పోటీ చేయని పార్టీల గుర్తింపు రద్దు చేసింది. మనుగడలోలేని మరో 86 పార్టీలను ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించింది. ఢిల్లీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 253 యాక్టివ్‌గా లేని రాజకీయ పార్టీలు ఉన్నట్లు గుర్తించారు. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు రాసిన లేఖలకు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎలక్షన్ కమిషన్ దగ్గర కుప్పలు తెప్పలుగా పార్టీలు రిజిష్టర్ అయ్యాయి. అందులో చాలా పార్టీలు ఇప్పుడు యాక్టివ్‌గా లేవు. ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పార్టీల ప్రక్షాళన మొదలుపెట్టింది. అయితే ఈ నిర్ణయంపై ఏవేని అభ్యంతరాలుంటే తగిన సాక్ష్యాలతో తమను సంప్రదిస్తే పరిశీలిస్తామని ఈసీ ప్రకటించింది.
- Advertisement -