దేశవ్యాప్తంగా రూ.4658.16 కోట్లు సీజ్

21
- Advertisement -

75 ఏండ్ల లోక్ సభ ఎన్నికల చరిత్రలోనే ఈసారి ఎన్నికల ముందే అత్యధికంగా డబ్బును సీజ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అక్రమ మధ్యం, డబ్బు,ఇతర ఆభరణాలు అన్ని కల్పి దేశవ్యాప్తంగా 4658.16 కోట్లు సీజ్ చేశారు ఆయా రాష్ట్రాల పోలీస్, ఆబ్కారీ శాఖ అధికారులు.

మార్చి 1నుండి రోజువారిగా 100 కోట్లు సీజ్ చేశారు. 2019 ఎన్నికల్లో మొత్తం 3475 కోట్లు సీజ్ చేయగా మొదటి విడత ఎన్నికలు ప్రారంభం కాకముందే 4650 కోట్లు సీజ్ చేసినట్లు ఈసీ అధికారులు వెల్లడించారు.

అత్యధికంగా రాజస్థాన్ లో 778 కోట్లు,గుజరాత్ 605 కోట్లు,తమిళనాడు 460 కోట్లు,మహారాష్ట్ర 431 కోట్లు,పంజాబ్ 311 కోట్లు,కర్ణాటక 281 కోట్లు,ఢిల్లీ 236 కోట్లు,వెస్ట్ బెంగాల్ 219 కోట్లు,బీహార్ 155 కోట్లు, ఉత్తరప్రదేశ్ 145 కోట్లు,అస్సాం 141 కోట్లు,ఆంద్రప్రదేశ్ 125.97 కోట్లు,తెలంగాణ 121.84 కోట్లు,అతి తక్కువగా పాండిచెర్రీ 1 లక్ష 73 వేల 900 సీజ్ చేసినట్లు వెల్లడించారు ఈసీ అధికారులు.

Also Read:పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌లో ‘భార‌తీయుడు 2’

- Advertisement -