- Advertisement -
దుబ్బాకలో బీజేపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు తెరలేపారు. ఎన్నికల వేళ పంచేందుకు ఉంచిన చీరలను పట్టుకున్నారు స్ధానికులు. బీజేపీ జిల్లా సెక్రటరీ అంబేటి బాలేశ్ గౌడ్ ఇంట్లో 115 చీరలు, 42 ప్యాంట్లు, షర్ట్స్ సీజ్ చేసింది ఎన్నికల సంఘం.చీరల పంపిణీపై పోలీస్ స్టేషను లోకేసు నమోదైంది.
ఇక ఇప్పటికే మహిళలకు చీరలు పంచుతున్నారంటూ బీజేపీపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది. రఘునందన్‌రావు తదితర బీజేపీ నాయకులు.. చీరలు, డ్రెస్ మెటీరియల్స్‌ను పంపిణీ చేస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, ఈ వస్ర్తాలను నిల్వ చేసేందుకు బాలాజీ ఫంక్షన్ హాలును ఉపయోగించుకుంటున్నారని ఫిర్యాదులో టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాసరెడ్డి, సోమ భరత్‌కుమార్ గుప్త పేర్కొన్నారు.
- Advertisement -