కొత్తగా 5145 కేసులు నమోదు..

102
corona in ap

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 5145 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 744864కు చేరింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 862 కేసులు రాగా, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 139 మందికి కరోనా సోకినట్టు వెల్లడైంది. అదే సమయంలో రాష్ట్రంలో మరో 31 మంది కరోనాతో మరణించారు. గరిష్టంగా ప్రకాశం జిల్లాలో ఐదుగురు మృత్యువాత పడ్డారు.

తాజాగా 6,110 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 6,91,040 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 47,665 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6,159కి పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తాజా బులెటిన్‌లో వెల్లడించారు.