హుజూరాబాద్ ఉపఎన్నిక ఏర్పాట్లపై ఈసీ సమీక్ష..

182
- Advertisement -

హుజూరాబాద్ ఉపఎన్నికకు సమయం దగ్గర పడడంతో గురువారం ఈ ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించింది. సీఈఓ, నోడల్ అధికారులు, కరీంనగర్, హన్మకొండ కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులతో సమీక్ష జరిగింది. ఎన్నికల ఏర్పాట్లు, శాంతి భద్రతల అంశంపై సమీక్షలో చర్చించారు. డబ్బు, మద్యం పంపిణీ ఫిర్యాదులపై ఆరా తీశారు ఈసీ. ఫిర్యాదులు వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీ అధికారులను ఆదేశించారు.

- Advertisement -