ఎన్నికల్లో అసత్య ప్రచారాన్ని అరికట్టడానికి కొత్త వెబ్సైట్ ను తీసుకొచ్చింది ఎన్నికల కమిషన్. మిథ్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ పేరిట వెబ్సైట్ తీసుకువచ్చింది ఈసీ. వెబ్సైట్ను సీఈసీ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్వర్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు ప్రారంభించారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించడమే ఈ కొత్త వెబ్సైట్ లక్ష్యమని ఈ సందర్భంగా ఈసీ వెల్లడించింది. అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టి, ఎన్నికల సమయంలో ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించేందుకు ఈ కొత్త వెబ్సైట్ ఉపయోగ పడుతుందని ఈ సందర్భంగా ఈసీ వెల్లడించింది. ప్రజలు ఎప్పటికప్పుడు అడిగే ప్రశ్నలను, వెలుగు లోకి వచ్చిన నకిలీ సమాచారాన్ని ఈ రిజిస్టరు ద్వారా అప్డేట్ చేస్తూ ఓటర్లకు తెలియజేస్తామని ఎన్నికల కమిషన్ చెప్పింది.
Also Read:రూ.100 కోట్లకు చేరువలో టిల్లూ స్వ్కేర్!