బెంగాల్‌లో హింసాత్మక ఘటనల దృష్ట్యా ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న హింసపై ఈసీ కి డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నివేదిక సమర్పించారు. అయితే ఈ నివేదికలోజిల్లా అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం నుంచి ఈసీకి సరైన సహకారం లేదు. అభ్యర్థులెవరికీ ప్రచారం చేసుకునేందుకు లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ కనిపించడం లేదని. ఓటర్లు భయం లేకుండా స్వేచ్ఛగా అందరి అభ్యర్థుల ప్రచారాన్ని వినే అవకాశం లేకుండా పోయింది. అంతర్గతంగా ఓటర్లలో భయం కనిపిస్తోందని నివేదికలో స్పష్టం చేశారు.
ఇక కేంద్ర బలగాలు ఎన్నికల తర్వాత వెళ్లిపోతాయి.. కానీ మేము ఎప్పటికీ ఉంటాము అని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారు అని నివేదించారు పశ్చిమబెంగాల్ ఇన్చార్జ్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్. ఈ నివేదిక ఆధారంగా ఎన్నికల ప్రచారాన్ని ఒకరోజే ముందే ముగించాలని ఈసీ ఆదేశం. చివరిదశ పోలింగ్‌కు రేపటితో ప్రచార గడువు ముగియనుండగా.. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం ఒకరోజు ముందే ఎన్నికల ప్రచారం ముగించాలని ఈసీ ఆదేశించింది.
ఈ నెల 19వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఏడవ దశ పోలింగ్ నిర్వహణ జరగనున్న విషయం తెలిసిందే. బిహార్-8, జార్ఖండ్-3, మధ్యప్రదేశ్-8, పంజాబ్-13, ఛత్తీస్‌గడ్-1, ఉత్తరప్రదేశ్-13, హిమాచల్ ప్రదేశ్-4, పశ్చిమబెంగాల్-9 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.