సెల్ఫీ కోరిక ఆమె ప్రాణాలు తీసింది..!

322
Lady Doctor Died In Goa Beach

గోవా బీచ్‌లో తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ డాక్టర్‌ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఊటుకూరు రమ్యకృష్ణ వృత్తిరీత్యా ఓ వైద్యురాలు. 2008 వరకు జగ్గయ్యపేట హెల్త్ సెంటర్ లో డాక్టర్ గా పనిచేసిన రమ్యకృష్ణ ఆ తర్వాత గోవాలో ప్రభుత్వ అనుబంధ వైద్యసంస్థలో ఉద్యోగంలో చేరారు.

అయితే మంగళవారం సాయంత్రం డాక్టర్ రమ్యకృష్ణ సరదాగా గడపటానికి గోవా బీచ్‌కు వెళ్లారు. అక్కడ సెల్ఫీ తీసుకుంటుండగా సముద్రపు అలలు ఉద్ధృతంగా రావడంతో ఆమె కొట్టుకుపోయాయి. రమ్యకృష్ణకు తల్లి, సోదరులు, సోదరి ఉన్నారు. పేషంట్లను పేర్లతో సహా గుర్తుపెట్టుకొని పిలిచే రమ్యకృష్ణ మృతితో జగ్గయ్యపేటలో విషాదం నెలకొంది.