- Advertisement -
తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల బండ ప్రకాశ్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఆయన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్‌కు సంబంధించిన షెడ్యూల్ వెలువడింది ఈసీ. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. మే 12న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మే 19. మే 30న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, అనంతరం ఓట్లను లెక్కించనున్నారు.
- Advertisement -