Beef:బీఫ్‌ ఎక్కువగా తింటున్నారా?

53
- Advertisement -

మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అనేక రకాల హెల్త్ టిప్స్ పాటించడం ఎంతో ముఖ్యం. అయితే మనకు పోషకాహార లోపంతోనే అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కూరగాయలు తినడం కంటే మాంసకృత్తులు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఫలితంగా అనారోగ్యబారిన పడుతున్నారు.

ముఖ్యంగా గుండె జబ్బులకూ మాంసాహారం కారణమవుతోంది. , గుండెలో తేడాలు కనిపించాయని తేలిన తరువాత మాంసాహారాన్ని తీసుకోవడం ఆపేయడం మంచిది. అంతేగాదు మాంసాహారం తిన్నాక అరగడానికి ఎంతో సమయం పడుతోంది. దాదాపు 3 గంటలకు పైగా సమయం పడుతుంది.

మాంసం కఠినంగా అరిగే ఆహారం. అందరి జీర్ణాశయం ఒకే తీరులో ఉండదు. జఠరాగ్ని బలాన్ని అనుసరించి ఆహారం అరుగుదల ఆధారపడి ఉంటుంది. జీర్ణాశయం బలహీనంగా ఉన్నవారికి మాంసాహారం తీవ్ర ఎఫెక్ట్ చూపుతుంది. ఆవు, ఎద్దు, గాడిద, గుర్రం, గొర్రె లాంటి జంతు మాంసాలలో కార్నిటైన్ అనే పదార్థం ఉంటుంది. అది గుండెకు సరఫరా అయ్యే రక్తనాళాలను మూసుకొనిపోయేలా చేస్తుంది. తద్వారా గుండె దెబ్బతింటుందని అనేక పరిశోధనలు చెప్తున్నాయి.

మాంసం ద్వారా పేగుల్లోకి చేరిన కార్నిటైన్ అక్కడ ఉండే బాక్టీరియా ప్రభావంవలన ‘ట్రై మిథలమైన్ యన్‌ఆక్సయిడ్’(టిఎమ్‌ఎఓ)గా మారుతుంది. మాంసం, గ్రుడ్లు, పాల పదార్థాలలో ఈ కార్నిటైన్ మోతాదు ఎక్కువగా ఉంటుందని అది ఎక్కువౌతున్నకొద్దీ గుండె జబ్బు ప్రమాదం మరింత పెరుగుతుందని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే మాంసాహారం ఎంత తక్కువైతే అంత తగ్గించుకుంటే మంచిది.

Also Read:Modi: హనుమాన్ చాలీసా వినడం నేరమేనా?

- Advertisement -