ఇండోనేషియాలో భారీ భూకంపం..సునామీ హెచ్చరిక!

0
- Advertisement -

తూర్పు ఇండోనేషియాలోని ఫ్లోరెస్ దీవిలో శనివారం ఉదయం 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో కనీసం ఇద్దరు (ఒక పురుషుడు, ఒక మహిళ) మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూకంపం ధాటికి సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో వందలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.

యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం… శనివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5:58 గంటలకు భూమికి 10 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించింది. తూర్పు నుసా తెంగ్గారా ప్రావిన్స్‌లోని ఎండే (Ende) నగరానికి ఉత్తర-వాయువ్య దిశలో 68 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

భూకంపం తీవ్రత దృష్ట్యా ఇండోనేషియా అధికారులు వెంటనే సునామీ అలర్ట్ జారీ చేశారు. సముద్రంలో 0.5 మీటర్ల నుండి 3 మీటర్ల (1.6 నుండి 9.8 అడుగులు) ఎత్తు వరకు రాకాసి అలలు ఎగిసిపడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఫ్లోరెస్ దీవిలోని మౌమెరే పట్టణ నివాసితులను ఎత్తైన ప్రాంతాలకు ఖాళీ చేయించారు.తీరప్రాంతాల్లో ఇప్పటికే 19 నుండి 30 సెంటీమీటర్ల ఎత్తులో సునామీ అలలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.తూర్పు నుసా తెంగ్గారా, దక్షిణ సులవేసి, మరియు పశ్చిమ నుసా తెంగ్గారా ప్రావిన్సులకు సునామీ ముప్పు పొంచి ఉందని ఇండోనేషియా వాతావరణ, భూకంప నివారణ సంస్థ (BMKG) డైరెక్టర్ విజయాంటో స్పష్టం చేశారు.

Also Read:Dharman:పవర్‌ఫుల్ డాక్టర్‌గా రజనీ

భూకంపం ధాటికి పలు భవనాలు దెబ్బతిన్నాయి, కొలిచివేసినట్లున్న గోడలు, విరిగిపడిన నిర్మాణాలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తీర ప్రాంతాల్లో సముద్రం వెనక్కి తగ్గుతున్న దృశ్యాలు కూడా బయటపడ్డాయి.అకస్మాత్తుగా భూమి ప్రకంపించడంతో నేను తీవ్ర భయాందోళనకు గురయ్యాను. దెబ్బకి ఆసుపత్రిలోని రోగులు కూడా బయటకు పరుగులు తీశారు. తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, ఆస్పత్రి గోడలకు పగుళ్లు రావడం చూశాను అని ఓ ప్రత్యక్ష సాక్షి మీడియాకు తెలిపారు.

- Advertisement -