దేశ రాజధానిలో భూకంపం

251
- Advertisement -

దేశరాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. దాని పరిసర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఈ విషయాన్ని వెల్లడించింది. భూకంప కేంద్రం నేపాల్‌లో ఉంది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 5.4 గా నమోదైంది. శనివారం రాత్రి 7.57 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి.

దేశ రాజధానిలో భూమి కంపించడం ఈ వారంలో ఇది రెండోసారి. గత బుధవారం కూడా ఢిల్లీలో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాగా, హిమాలయ పర్వతాల్లో భారీ భూకంపం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తాజాగా హెచ్చరించారు. తగు చర్యలు తీసుకుంటే ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చని అంటున్నారు. భారత భూఫలకంపై యురేషియా భూఫలకం ఒత్తిడి ఈ మధ్య నిలకడగా కొనసాగుతోందనీ, తద్వారా ఉత్పన్నమయ్యే శక్తి భూకంపాల రూపంలో బయటకు వస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -