నేపాల్‌ని వణికించిన భూకంపం..

29
- Advertisement -

నేపాల్‌ని భూకంపం వణికించింది. గురువారం రాత్రి రెండు సార్లు భూకంపం సంభవించగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంపాలు రిక్టర్ స్కేలుపై 5.9, 4.8గా నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది.

అర్ధరాత్రి రెండు సార్లు భూకంపం సంభవించడంతో ఇళ్లలో నిద్రపోతున్న ప్రజలు బయటకు పరుగులు తీశారు. గతంలో నేపాల్ దేశంలో భారీ భూకంపం సంభవించడంతో భూమి కంపించినపుడల్లా నేపాల్ ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. అయితే ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:పిక్ టాక్ : బోల్డ్ లుక్ తో మతులు పోగొట్టింది

- Advertisement -