తమ వంతు భాధ్యతగా మొక్కలు నాటి, సంరక్షించాలి : సుమిత్ర ఆనంద్ తానోభా

30
sumitra
- Advertisement -

దేశ వ్యాప్తంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖులు మొక్కలు నాటుతున్నారు. ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్సీ మెంబర్ సుమిత్ర ఆనంద్ తానోభా గురుపౌర్ణమి పురస్కరించుకుని నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ , శ్రీదేవిలతో కలిసి మొక్కలు నాటారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ అనే ఈ మహాయజ్ఞంలో అందరం భాగస్వాములము కావాలని చైర్మన్‌ సాయిచంద్‌ అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు తమ వంతు భాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆమె కోరారు.

- Advertisement -