పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

88
ts
- Advertisement -

టీఎస్ పాలిసెట్ – 2022 ఫలితాలు వెలువడిన వెంటనే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు విడుద‌ల చేశారు. ఈ నెల 18 నుంచి 22 వ‌ర‌కు ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న‌కు స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. 20 నుంచి 23వ తేదీ వ‌ర‌కు అభ్య‌ర్థుల ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న జ‌ర‌గుతుందని తెలిపారు. ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న పూర్త‌యిన అభ్య‌ర్థులు 20 నుంచి 25 వ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్లుకు అవకాశం కల్పించారు. వెబ్‌ ఆప్షన్ల తర్వాత 27న సీట్ల‌ను కేటాయించ‌నున్నారు. 27 నుంచి 31వ తేదీ వ‌ర‌కు త‌మ‌కు కేటాయించిన కాలేజీల్లో అభ్య‌ర్థులు.. ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

పాలిసెట్‌ చివరి ఫేజ్‌ కూడా అధికారులు తేదీలను ప్రకటించారు. ఆగ‌స్టు 1 నుంచి పాలిసెట్ తుది విడ‌త కౌన్సెలింగ్ ప్ర‌క్రియ ప్రారంభం కానుందని తెలిపారు. 1న తుది విడ‌త స్లాట్ బుకింగ్ చేసుకోవ‌చ్చని….. 2వ తేదీన ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న జ‌ర‌గుతుందని తెలిపారు. 1 నుంచి 3వ తేదీ వ‌ర‌కు తుది విడ‌త వెబ్ ఆప్ష‌న్ల న‌మోదుకు అవ‌కాశం క‌ల్పించారు. ఆగ‌స్టు 6న సీట్ల కేటాయింపు జ‌ర‌గ‌నుంది. సీట్లు పొందిన అభ్య‌ర్థులు 6 నుంచి 10వ తేదీ వ‌ర‌కు ఆయా కాలేజీల్లో ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగ‌స్టు 17 నుంచి పాలిటెక్నిక్ మొద‌టి సంవ‌త్స‌రం త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయని ప్రకటించారు. ఆగ‌స్టు 8న పాలిసెట్ స్పాట్ అడ్మిష‌న్ల విధివిధానాల‌ను వెల్ల‌డించ‌నున్నారు.

- Advertisement -