ఏప్రిల్ మే జూన్ నెలల్లో ఉత్తర, ఈశాన్య, మధ్య భారతంలో గరిష్ట స్థాయి కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. గతేడాది కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని కూడా తెలిపింది. ఈ మేరకు ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఎండలు నమోదు అవుతాయన్నారు.
ముఖ్యంగా తెలంగాణలో విపరీతమైన వడగాలులు ఉంటాయని ప్రజలందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు. గతేడాది కంటే ఈ సారి గరిష్టంగా ఎండలు నమోదు అవుతాయని తెలిపారు. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలో సాధారణం కంటే గరిష్ట స్థాయికి చేరుకుంటాయన్నారు. ఏప్రిల్ నుండి జూన్ వరకు వడగాలులు తీవ్రత ఎక్కువగా ఉంటుందని మరీ ముఖ్యంగా తూర్పు ఈశాన్య జిల్లాల్లో ఎక్కువగా ఉంటాయని అన్నారు. వచ్చే ఈ మూడు నెలలు చాలా కీలకమని అన్నారు.
ముఖ్యమైన పనులకు తప్ప అనవసరంగా బయటకు వెళ్లకూడదని సూచించారు. ఉదయం పూట 9గంటల లోపు ముఖ్యమైన పనులను పూర్తి చేసుకోని ఇండ్లలోకి చేరుకోవాలన్నారు. సాయంత్రం 5గంటల తర్వాత బయటకి వచ్చిన వడగాలుల ప్రభావం కొంతమేర ఉంటుందని తెలిపారు. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకోవాలన్నారు.
ఇవి కూడా చదవండి…