ఈ- పాస్‌ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి..

40
ts

రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలను సీజ్ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఈ-పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. బైక్‌లు, ఆటోలను పాస్ లేకుండా వస్తే అనుమతిని నిరాకరిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణలోకి ఈపాస్ లేకుండా వచ్చిన వారికి వెనక్కి పంపిస్తుండగా పదేపదే వస్తున్న వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు.