గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ఈ రోజు రాజ్ భవన్లో ఈ ఆఫీస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. నా భర్తకు నేప్రలాజిస్ట్ విభాగంలో ద్రోణాచార్య అవార్డు దక్కింది.ఆయనను అభినందించెందుకే సీఎం కేసీఆర్ ఈ రోజు రాజ్ భవన్ వచ్చారు. ఈ సందర్భంగా ఈ ఆఫీస్ నిర్వహణపై అభినందనలు తెలిపారు అని గవర్నర్ అన్నారు. నాలుగు నెలలుగా ఈ ఆఫీస్ పద్ధతిని అవలభిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర సచివాలయంలో ఈ ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తున్నాందుకు నా అభినందనలు అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆఫీస్ విధానమే మేలు అని గవర్నర్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది అని గవర్నర్ ప్రశంసించారు. కోవిడ్ విషయంలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ ఎంతో మెరుగ్గా పని చేస్తోంది, తెలంగాణ రాష్ట్రంలో రికవరీ రేట్ ఎక్కువగా ఉంది.పొరుగు రాష్ట్రాల్లో కోవిడ్ ఉధృతి పెరుగుతుంది. ఇక్కడ ప్రభావం తగ్గినట్లు కనిపిస్తోంది. పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అప్రమత్తంగా వ్యవహరించాలి. దేశంలో తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా గా ఉండడం గర్వంగా ఉందన్నారు గవర్నర్.