కరాచీ స్టాక్ మార్కెట్‌పై ఉగ్ర దాడి…

35
karachi stock market

పాకిస్ధాన్‌లోని కరాచీ స్టాక్ మార్కెట్‌పై ఉగ్రదాడి జరిగింది. స్టాక్ మార్కెట్ బిల్డింగ్‌పై గ్రేనెడ్ దాడి జరుగగా ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు సింధ్ ఇన్‌స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ ముస్తాక్ మ‌హ‌ర్ తెలిపారు.

పాక్ స్టాక్ ఎక్స్‌చేంజ్ బిల్డింగ్‌లోకి ప్ర‌వేశించిన న‌లుగురు మిలిటెంట్ల‌ను హ‌త‌మార్చిన‌ట్లు భ‌ద్ర‌తా ద‌ళాలు తెలిపాయి. పార్కింగ్ ఏరియా నుంచి భ‌వ‌నంలోకి ఉగ్ర‌వాదులు ఎంట‌ర్ అయ్యార‌ని, ఆ త‌ర్వాత వాళ్లు ఫైరింగ్‌కు దిగిన‌ట్లు పాకిస్థాన్ స్టాక్ ఎక్స్‌చేంజ్ డైర‌క్ట‌ర్ అబిద్ అలీ హ‌బీబ్ తెలిపారు.గతంలో కూడా పాకిస్ధాన్ మార్కెట్ పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.