సల్మాన్‌-వెంకీ మల్టీస్టారర్..?

233
- Advertisement -

టాలీవుడ్‌లో ఒక వైపున బయోపిక్‌ల హవా కొనసాగుతూ ఉంటే, మరో వైపున మల్టీ స్టారర్‌ల జోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మరో మల్టీస్టారర్ మూవీకి సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక హీరోగా వెంకటేశ్ .. మరో హీరోగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ చేయనున్నట్టుగా చెబుతున్నారు.

ఈ సినిమా స్టోరీ యుద్ధ నేపథ్యంలో సాగనుంది, భారీ బడ్జెట్ వార్ డ్రామాగా ఈ మూవీ ఉంటుందని తెలుస్తుండగా, ప్రముఖ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేస్తారని అంటున్నారు. ఆల్రెడీ దర్శక నిర్మాతలు ఈ ఇద్దరినీ కలిసి కథ చెప్పడం వాళ్ల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగిపోయిందని సమాచారం.

Victory Venkatesh

అయితే పవన్ కళ్యాణ్‌, మహేష్‌ బాబు వంటి టాప్ హీరోలతో మల్టీస్టారర్ చిత్రాలు చేసిన వెంకీ ప్రస్తుతం చైతూ, వరుణ్‌ తేజ్‌తో కలిసి పని చేస్తున్నాడు. ఓకే బంగారంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన దుల్కర్ మహానటి చిత్రంతో మరింత దగ్గరయిన సంగ‌తి తెలిసిందే. మరి వీరిద్దరి కాంబోలో ఈ సినిమా ఎప్పుడు మొదలౌతుందో చూడాలి.

- Advertisement -