స్టార్ డైరెక్టర్ తో విజయ్ మూవీ ఫిక్స్ ..!

281
- Advertisement -

విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఈ పేరు తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. అర్జున్ రెడ్డి తో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయిన విజయ్ దేవరకొండ ఈ మధ్య వచ్చిన గీత గోవిందంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఫుల్ క్రేజ్ దక్కించుకున్నాడు. విజయ్ కి వస్తున్న క్రేజ్ చూసి స్టార్ డైరెక్టర్లు కూడా విజయ్ వెంటపడటం మొదలెట్టారు. ప్రస్తుతం ఓ స్టార్ డైరెక్టర్ తో విజయ్ సినిమా ఫిక్స్ అయినట్టు వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

Vijay Devarakonda

ఓ సాధారణ కథతో వచ్చిన గీత గోవిందం సినిమానే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిందంటే ఇక ఓ ప్రముఖ డైరెక్టర్ దర్శకత్వంలో, ఓ మంచి కథతో సినిమా వస్తే విజయ్ ని ఆపడం ఎవరితరం కాదని విజయ్ అభిమానులు సంబరపడిపోతున్నారు. అసలా స్టార్ డైరెక్టర్ ఎవరు అనే కదా మీ సందేహం. వేరే ఎవరో కాదండి..ప్రేమ కథా చిత్రమ్, భలే భలే మగాడివోయ్ సినిమాలతో ఘనవిజయాన్ని సాధించిన మన మారుతి గారే..!

Maruthi Dasari

మారుతి సినిమా అంటే ప్రేక్షకులను పూర్తిగా నవ్వించడమే ప్రధానాంశం. ఇక ఆయన సినిమాలో విజయ్ తన స్టైల్ లో కామెడీ పండిస్తే చూడాలని సోషల్ మీడియాలో అభిమానులు వరస కామెంట్లతో ఈ వార్తని బాగా ప్రచారం చేస్తున్నారు. ఇంకా అధికారకంగా ప్రకటన జరగకపోయినా వీరిద్దరి సినిమా కన్ఫామ్ అయిపోయినట్టు ఇండస్ట్రీలో టాక్.

- Advertisement -