పీఏసీ ఛైర్మన్‌గా దుద్దిళ్ల..!

266
duddilla sridhar babu
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుండి మూడు రోజుల పాటు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారి సీఎం కేసీఆర్‌ ఆర్థికమంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల హామీలకు పెద్దపీట వేయనుండగా ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్‌,చీఫ్ విప్‌,విప్‌లను నియమించనున్నారు కేసీఆర్.

ఇక ప్రతిపక్ష కాంగ్రెస్‌ నుండి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) ఛైర్మన్‌గా ఎవరిని నియమిస్తారో అన్నది సస్పెన్స్‌గా మారింది. ప్రాధాన్యత కలిగిన ఈ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీలో గట్టిపోటీ నెలకొంది. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి,దుద్దిళ్ల శ్రీధర్ బాబు,మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి,కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పీఏసీ ఛైర్మన్‌ పదవిని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీ నేతల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు పీఏసీ ఛైర్మన్ పదవి దక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గతంలో శాసనసభా వ్యవహారాలు, పౌరసరఫరాల శాఖల మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. దీంతో పాటు వివాదరహితుడిగా,అధిష్టానం వద్ద మంచిపేరు ఆయనకు పేరుంది. ఈ నేపథ్యంలో దుద్దిళ్లనే పీఏసీ ఛైర్మన్‌ పదవి వరించనున్నట్లు తెలుస్తోంది.

ఇక సీఎల్పీ నేతగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన భట్టి విక్రమార్కను నియమించడంతో ఉపనేతలుగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన గండ్ర వెంకటరమణారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలలో ఒకరు ఎస్టీ సామాజిక వర్గం నుంచి సీతక్క, పోడెం వీరయ్య, ఆత్రం సక్కుల్లో ఒకరిని ఎంపిక అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -