దొంగగా మారిన మహిళా డీఎస్పీ!

7
- Advertisement -

స్నేహితురాలి ఇంట్లో రెండు లక్షల నగదు, మొబైల్ ఫోన్ దొంగలించింది ఓ మహిళా డీఎస్పీ. మధ్యప్రదేశ్ – భోపాల్‌లోని జహంగిరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

అయితే స్నేహితురాలి ఇంటికి వెళ్లి అక్కడ నుంచి రెండు లక్షల నగదు, మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లింది పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న కల్పనా రఘువంశీ.

మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్లిన సమయంలో ఫోన్ మిస్ అయింది. నగదు, ఫోన్ మిస్ కావడంతో.. సీసీటీవీ పరిశీలించగా ఆ సమయంలో డీఎస్పీ కల్పన వచ్చి క్యాష్, సెల్ఫోన్ తీసుకెళ్లినట్లు గమనించింది మహిళ . దీంతో డీఎస్పీ కల్పనాపై ఫిర్యాదు చేసింది స్నేహితురాలు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా రఘువంశీపై చోరీ కేసు పెట్టారు పోలీసులు.. ప్రస్తుతం పరారీలో ఉన్నారు ఆ మహిళా ఆఫీసర్.

Also Read:TTD:31న‌ త్రైమాసిక మెట్లోత్సవం

- Advertisement -