కౌలు రైతుల పంటను కొనుగోలు చేయరా?

11
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ఎకరాకి 18 క్వింటాళ్ల మొక్కజొన్న పంటను మాత్రమే కొంటామని కఠినమైన నిర్ణయాలు పెట్టింది అని మండిపడ్డారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. తెలంగాణలో ఎకరాకి 28 నుండి 32 క్వింటాళ్ల మొక్కజొన్న పంట పండుతుంది అన్నారు.

ఆ 18 క్వింటాళ్ల పంటను కూడా భూమి యజమాని వెళ్ళి వేలిముద్ర వేస్తేనే తీసుకుంటాం, కౌలు రైతుల పంట తీసుకోమని రూల్స్ పెట్టారు అన్నారు. 18 క్వింటాళ్ల పంటను మాత్రమే కొంటే మిగతా 12 క్వింటాళ్ల పంటను రైతులు ఏం చేయాలి? చెప్పాలని ప్రశ్నించారు.

భూ యజమాని అందుబాటులో లేకుంటే కౌలు రైతుల పంటను కొనుగోలు చేయరా? … ఇలాంటి నిర్ణయాలతో రైతులను ఈ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెడుతుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:బైక్‌ను కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన కారు

- Advertisement -