లాక్‌డౌన్‌ వేళ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు..!

250
hyderabad
- Advertisement -

కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు పోలీసులు కాస్త బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పుత్లిబౌలి చౌరస్తాలో ఓ ఆటో డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు పోలీసులు. అతడు మద్యం తాగినట్లు తేలడంతో ఆటోను స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేశారు పోలీసులు.

వివరాల్లోకి వెళ్తె..కోఠి వైపు నుంచి వస్తున్న ఖాళీ గూడ్స్‌ ఆటో పుత్లిబౌలి చౌరస్తాలో బోల్తా కొట్టింది. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి ఆటోడ్రైవర్‌కు డ్రంక్‌ డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఆదేశించారు.

సుల్తాన్‌బజార్‌ ట్రాఫిక్‌ పోలీసులు తమ వద్ద ఉన్న బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్ష చేయగా ఆటో డ్రైవర్ మద్యం తాగినట్లు తేలగా కేసు నమోదుచేశారు పోలీసులు.

- Advertisement -