సచిన్ సరికొత్త అవతారం..!

386
sachin arjun tendulkar
- Advertisement -

లాక్ డౌన్ నేపథ్యంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కి అందిస్తున్నారు భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. యువీతో పాటు పలువురు విధించిన ఛాలెంజ్‌లను స్వీకరించడం వారికి కొత్త ఛాలెంజ్‌లు ఇస్తున్న సచిన్ తాజాగా కొత్త అవతారం ఎత్తాడు.

తన కొడుకు అర్జున్ టెండూల్కర్‌కు హెయిక్ కట్ చేస్తూ హెయిర్ స్టైలిస్ట్‌గా మారాడు సచిన్‌. కుమార్తె సారాతో కలిసి అర్జున్ కు హెయిర్ స్టైల్ చేస్తూ ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు.

ఒక తండ్రిగా మీరు ప్రతిదాన్ని చేయాలి, అది మీ పిల్లలతో ఆటలు ఆడటం, వారితో జిమ్ చేయడం లేదా వారి జుట్టును కత్తిరించడం. అయితే హెయిర్‌ కట్ లో నువ్వు ఎల్లప్పుడూ అందంగా ఉంటావ్ అర్జున్ అని పేర్కొన్నాడు సచిన్‌. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -