ప్రధాని మోదీ నివాసంపై డ్రోన్ కలకలం..

60
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీ నివాసంపై డ్రోన్ కలకలం రేపింది. ఇవాళ ఉదయం 5గంటల సమయంలో ప్రధాని నివాసం పై డ్రోన్ ఎగురుతున్నట్లు గుర్తించారు ఎస్పీజీ సిబ్బంది. దీంతో ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించడంతో ఉన్నతాధికారులు హుటాహుటీన ప్రధాని నివాసానికి చేరుకున్నారు. డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎటు వెళ్లింది అనే విషయాల ఆరా తీస్తున్నారు. అయితే డ్రోన్ ను గుర్తించేందుకు ప్రయత్నించినా ఆచూకీ దొరకలేదు.

ప్రధాని మోదీ నివాసం, పరిసర ప్రాంతాల్లో నో ఫ్లయింగ్ జోన్ అమల్లో ఉంది. అయినా, ఆ ప్రాంతంలో డ్రో‌న్ ఎగరడం కలకలం రేపుతోంది. ప్రధాని అధికారిక నివాస భవనం దేశ రాజధాని ఢిల్లీలోని లుటియన్స్ జోన్‌లోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఉంది.

Also Read:గురుపౌర్ణమి.. భక్తుల రద్దీ

- Advertisement -