పుకార్లు నమ్మకండి: మంత్రి జగదీష్ రెడ్డి

214
jagadeesh reddy

కరోనాపై వస్తున్న పుకార్లను నమ్మవద్దన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఆదివారం రాత్రి 9 గంటలనుండి 9 నిమిషాల సేపు దేశవ్యాప్తంగా లైట్లు ఆర్పేసి దీపాలు వెలిగించాలి అంటూ ప్రధాని మోడీ,ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు పై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పందించారు.

ఈ కార్యక్రమంతో ఏదో జరిగి పోతుందంటూ సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్న పుకార్ల పై ఆయన వివరణ ఇచ్చారు. తొమ్మిది గంటల నుండి తొమ్మిది నిమిషాల సేపు ఇంట్లో లైట్ లు స్వచ్చందంగా అపు చేసి లాక్ డౌన్ కు మద్దతు పలకండన్నారు.

నిద్రకు ఉపక్రమించేసమయంలో లైట్లు బంద్ చెయ్యడం సహజమే…దీంతో గ్రిడ్ కు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. రోజువారీగా రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు డిమాండ్ తగ్గడం సహజమే అన్నారు.

కరోనా మీద చేస్తున్న యుద్ధంలో లైట్లు ఆర్పేసి దీపాలు వెలిగించడం ఒక భాగమే అన్నారు. కేవలం ఇళ్లలో వెలిగించే లైట్లు మాత్రమే బంద్ చెయ్యాలి..వీదీ లైట్ల తో పాటు అత్యవసర సేవలు అందించే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు ఇది వర్తించదన్నారు.

ఆ తొమ్మిది నిమిషాలు బంద్ చేసేది కేవలం లైట్లు మాత్రమేనని…ఫ్రిడ్జ్ లు,ఫ్యాన్ లు, ఏ సి లు బంద్ చేయాల్సిన అవసరం లేదన్నారు. కరోనా కట్టడిలో బాగంగా అటు ప్రధాని ఇటు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపులో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు.