ప్రతి ఒక్కరికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కొందరికి రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే టీ లేదా కాఫీ తాగితే మరికొందరికి రోజుకు నాలుగు లేదా ఐదు సార్లు టీ లేదా కాఫీ తాగనిదే రోజు గడవని పరిస్థితిలో ఉంటారు. ఒత్తిడికి లోనైనప్పుడు లేదా కాస్త తలనొప్పిగా ఉన్నప్పుడు టీ లేదా కాఫీ తాగడం మామూలే. అయితే ఈ అలవాటు మితిమీరితే ప్రమాదమే అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఎక్కువసార్లు టీ తాగడం వల్ల శరీరంలో ఆయా లోపాలు సంభవించే ప్రమాదం ఉందట. ముఖ్యంగా ఐరన్ లోపం వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఐరన్ లోపిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. శరీరంలో ఐరన్ లోపిస్తే బలహీనత, అలసట, నిద్రలేమి, రక్త హీనత వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయట..
ఇంకా ఈ సమస్యలు మాత్రమే కాకుండా జ్ఞాపకశక్తి లోపించడం, గుండెల్లో మంట, ఎసిడిటీ, మలబద్దకం వంటి ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తాయని చెబుతున్నారు నిపుణులు. టీ లేదా కాఫీలో ఉండే కేఫెన్ ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందట. సాధారణంగా తలనొప్పి ఉందని టీ ఎక్కువ సార్లు తాగితే అది మైగ్రేన్ దారి తీస్తుంది. ఇంకా టీలో ఉండే రసాయనాలు మలబద్దకాన్ని పెంచి జీర్ణ వ్యవస్థను దెబ్బ తీస్తాయట. ఇవే కాకుండా టీ ఎక్కువగా తాగితే విటమిన్ బి12 కూడా లోపించే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. విటమిన్ బి12 లోపిస్తే నాడీ వ్యవస్థ దెబ్బ తింటుంది. తద్వారా జ్ఞాపక శక్తి మందగిస్తుంది. అంతేకాకుండా మతిమరుపు, వణుకు, రక్తపోటు పెరగడం.. వంటి సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కాబట్టి టీ తాగే విషయంలో జాగ్రత్తగా ఉండాలని పరిమితి మేరకే టీ లేదా కాఫీ తాగడం మంచిదని చెబుతున్నారు.
Also Read:‘గర్భాసనం’ యొక్క లాభాలు..!