ఫ్రిడ్జ్ లో వాటర్ తాగుతున్నారా..జాగ్రత్త!

10
- Advertisement -

ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఫిబ్రవరి ముగియకుండానే ఎండలు మండి పోతున్నాయి. రోజులు గడిచే కొద్ది ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో వేసవి తాపం నుంచి తప్పించుకునేందుకు చల్లటి పానీయాలు తాగడానికి ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు ప్రజలు. చల్లటి ఫ్రూట్ జ్యూస్, మజ్జిగ, ఫ్రీడ్జ్ వాటర్.. ఇలా ప్రతిదీ చల్లగా ఉండే ద్వారాలను ఎక్కువగా సేవిస్తుంటారు. మరి ముఖ్యంగా సమ్మర్ లో ఫ్రిడ్జ్ వాటర్ తరచూ తాగుతూ ఉంటారు ఎందుకంటే ఇటు ఇంట్లోను అటు ఆఫీస్ లోనూ ఫ్రిడ్జ్ తప్పనిసరిగా ఉంటుంది. దాంతో సమ్మర్ లో ఫ్రిడ్జ్ లోని వాటర్ తాగడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతుంటారు. అయితే ఫ్రిడ్జ్ వాటర్ తరచూ సేవిస్తే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫ్రిడ్జ్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉందట.

ఎందుకంటే ఫ్రీడ్జ్ వాటర్ లో ఉండే శీతల ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతకు మద్య వ్యత్యాసం ఉండడం వల్ల రక్తప్రసరణలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. తద్వారా గుండె జబ్బులు ఏర్పడతాయట. ఇంకా ప్రతిసారి ఫ్రిడ్జ్ వాటర్ తాగితే దంతాలు, చిగుళ్ళు సెన్సిటివ్ గా మారి నోటి సమస్యలకు కారణం అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవే కాకుండా ఫ్రిడ్జ్ వాటర్ అతిగా తాగే వారిలో కిడ్నీ సంబంధిత రోగాలు కూడా ఏర్పడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు, కాబట్టి సమ్మర్ లో ఫ్రిడ్జ్ వాటర్ అతిగా తాగే వారు జాగ్రత్తగా ఉండడం మంచిదని నిపుణులు చెబుతున్నా మాట. ఈ సమ్మర్ లో ఫ్రిడ్జ్ వాటర్ కంటే కుండలోని వాటర్ తాగడం అలవాటు చేసుకుంటే మంచిదట. కుండలోని వాటర్ తాగడం వల్ల మినరల్స్, కాల్షియం ఎక్కువ లభిస్తాయి. తద్వారా డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:అనాసతో ఆరోగ్య ప్రయోజనాలు!

- Advertisement -