దత్తన్నకు షాక్‌ ఇవ్వనున్న లక్ష్మణ్..?

221
bjp dattatreya
- Advertisement -

తెలంగాణ బీజేపీలో సీట్ల పంచాయతీ మొదలైంది. బీజేపీ హాట్ సీటుగా భావించే సికింద్రాబాద్ నుండి బరిలో నిలిచేందుకు పార్టీ నేతలు ఆసక్తిచూపిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడినుండి ఆ పార్టీ సీనియర్ నేత,మాజీ కేంద్రమంత్రి దత్తాత్రేర ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో ఆయనకు షాక్‌ ఇచ్చి ఎంపీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవాలని సీనియర్ నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్‌,కిషన్ రెడ్డి పావులు కదుపుతున్నారు.

రెండు సార్లు సికింద్రాబాద్ నుండి ఎంపీగా గెలిచిన దత్తాత్రేయ రెండు సార్లు కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ నుండి గెలిచిన ఏకైక ఎంపీగా,పార్టీకి వీర విధేయుడిగా పేరు తెచ్చుకున్న దత్తన్నను కేంద్రమంత్రి పదవి నుండి తొలగిస్తూ షాకిచ్చారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.

తాజాగా బీజేపీ రాష్ట్ర నేతలు సైతం దత్తన్నను ఇంటికి పంపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించి బీజేపీ నేతల్లో హీట్ పెంచేశారు లక్ష్మణ్. మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా మాట్లాడిన లక్ష్మణ్‌..రాజకీయంగా అనుభవముంది..ఎంపీగా పోటీచేయాలనే ఆసక్తీ ఉందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నవేళ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

- Advertisement -