మొక్కలు నాటిన ఆర్మూడ్ రిజర్వ్‌ అదనపు డీసీపీ గిరిరాజు..

67
green

రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు ఆర్మూడ్ రిజర్వ్ అదనపు డి.సి.పి గిరిరాజు.ఆర్మూడ్ రిజర్వ్ అదనపు డి.సి.పి భీంరావు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్మూడ్ విభాగం అదనపు డి.సి.పి గిరిరాజు మంగళవారం తన కార్యాలయము అవరణలో మొక్కను నాటడంతో పాటు ఆర్మూడ్ రిజర్వ్ విభాగం ఎ.సి.పిలు శ్రీనివాస్, గంగాధర్, ఆర్.ఐ హోంగార్డ్స్ హతీరాంలను గ్రీన్ ఛాలేంజ్ కు నామిటెడ్ చేశారు.

పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో ఆదర్శనీయం , ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందివ్వాలని , ఈఅవకాశం కల్పించిన ఆర్మూడ్ రిజర్వ్ అదనపు డి.సి.పి భీంరావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.