శ్రీ వేంకటేశ్వర సూపర్ మూవీస్ బ్యానర్‌పై ‘ఎ ఫిల్మ్ బై అరవింద్’ వంటి సెన్సేషనల్ చిత్రాన్ని రూపొందించిన శేఖర్ సూరి దర్శకత్వంలో ఎ. వెంకటేష్ (ఛాంప్) నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘డా||చక్రవర్తి’. రిషి, సోనియామాన్ హీరో, హీరోయిన్‌లుగా నటించిన ఈ చిత్రం మే ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎ.వెంకటేష్ (ఛాంప్) మాట్లాడుతూ..”ఎ ఫిల్మ్ బై అరవింద్” చిత్ర దర్శకుడు శేఖర్ సూరి ఈ చిత్రాన్ని ఆద్యంతం ఎంతో ఉత్కంఠతను కలిగించేలా తెరకెక్కించారు. ఏప్రిల్ 19న ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా విడుదల చేసిన ఈ చిత్ర టీజర్‌లో యూట్యూబ్‌లో సంచలన విజయం సాధించి, సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. ప్రస్తుతం సినిమాకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అతి త్వరలో సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసి, మే ద్వితీయార్ధంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాము. ‘ఎ ఫిల్మ్ బై అరవింద్’లా ఈ చిత్రం కూడా ఘనమైన విజయాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నాము…అని అన్నారు.
దర్శకుడు శేఖర్ సూరి మాట్లాడుతూ…చక్కని కథతో, స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘డా||చక్రవర్తి’. నిర్మాత ఈ చిత్ర రూపకల్పన కోసం ఎంతగానో సహకరించారు. ఖర్చుకు వెనకాడకుండా హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో చిత్రాన్ని తెరకెక్కించాము. విజయ్ కురాకుల మ్యూజిక్ ఈ చిత్రానికి పెద్ద హైలైట్ అవుతుంది. అల్రెడీ విడుదలైన టీజర్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ప్రేక్షకులు మంచి విజయం అందిస్తారని కోరుకుంటున్నాను..అని అన్నారు.
రిషి, సోనియామాన్, గిరీష్ సహదేవ, లీనా, వంశీ, అశోక్‌కుమార్, కుమారన్, చైతన్య, పూజ, లావణ్య, పోకిరి విజయ్, అనిరుధ్ సింగ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: విజయ్ కురాకుల, కెమెరా: రాజేందర్, ఎఫెక్ట్స్: ఇతిరాజ్, డైలాగ్స్: చిట్టి శర్మ, మిక్సింగ్: రంగరాజు; ఎడిటింగ్: తిరుపతి రెడ్డి, నిర్మాత: ఆకుల వెంకటేష్ (ఛాంప్), కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శేఖర్ సూరి.