ప్రజలకు మరింత చేరువయ్యేందుకు టీఎస్‌ఆర్టీసీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రయాణీకులకు బంపర్ ఆఫర్‌లు ఇస్తున్న ఆర్టీసీ…సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తోంది. ఇందులో భాగంగా ఆర్టీసీలో సములమార్పులు తీసుకువస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీకి మరింత దగ్గర చేర్చేందుకు ఇప్పటికే పలు ఆఫర్లు ప్రకటించింది. గ్రేటర్ పరిధిలో ప్రయాణం సులువు చేసేందుకు ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురాగా తాజాగా ఐకానిక్ ఈ డబుల్ డెక్కర్ బస్సులను తీసుకురానుంది.
తెలంగాణ అలనాటి అందమైన ప్రదేశాలకు పెట్టింది పేరు. హైదరాబాద్ రాజ్యంను పాలించిన కుతుబ్‌షాహీలు, అస్‌ఫ్‌జాహీల కంటే ముందు నుంచి తెలంగాణ రాజ్యం పరిఢవిల్లింది. కాకతీయుల కాలం నుంచి తెలంగాణ చరిత్ర ప్రపంచఖ్యాతీని గడిచింది. హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్, కేబుల్ బ్రిడ్జి మాత్రమే కాదు. డబుల్ డెక్కర్ బస్సులు కూడా ఇక మీదట గుర్తొస్తాయి.
1990వ దశకంలో పుట్టినవారు డబుల్ డెక్కర్ బస్సుల్లో తిరిగిన జ్ఞాపకాలను ఇప్పటికీ యాది చేసుకుంటారు. మళ్లీ మూడు దశాబ్దాల తర్వాత హైదరాబాద్ రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సులు కనువిందు చేయనున్నారు. ప్రజల నుండి వస్తున్న విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సుల్ని తిప్పేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ చర్యలు ప్రారంభించింది.
ఇవి కూడా చదవండి..